Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*ఆదాబ్ టుడే కథనానికి అధికారుల స్పందన.. ఆక్రమణల తొలగింపు!* *కలం కదిలింది.. అధికార యంత్రాంగం స్పందించింది!*

Author
Posted By AADHAB TODAY
| 31 Oct 2026, 01:57 PM |
*ఆదాబ్ టుడే కథనానికి అధికారుల స్పందన.. ఆక్రమణల తొలగింపు!*  *కలం కదిలింది.. అధికార యంత్రాంగం స్పందించింది!*

*అంకుర హాస్పిటల్, గురు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, స్లీపవెల్ ఫర్నిచర్ షాప్ బోర్డ్, ఏ వన్ టీ కంపెనీ బోట్స్ సర్వీస్ రోడ్ ఆక్రమణలను తొలగించిన ఆల్విన్ కాలనీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది.*

శేర్లింగంపల్లి , అక్టోబర్ 31 (ఆదాబ్ టుడే):

*ఆదాబ్ టుడే కథనానికి అధికారుల స్పందన.. ఆక్రమణల తొలగింపు!*  *కలం కదిలింది.. అధికార యంత్రాంగం స్పందించింది!* - Additional Image

ప్రజా సమస్యలపై ఆదాబ్ టుడే అక్షర పోరాటం మరోసారి ఫలించింది! అక్టోబర్ 30, శుక్రవారం ఆదాబ్ టుడే దినపత్రికలో ప్రచురితమైన రహదారి ఆక్రమణల కథనానికి ఆల్విన్ కాలనీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. వివేకానంద నగర్ కమాన్ నుండి అను ఫర్నిచర్ వరకు సర్వీస్ రోడ్ లో వ్యాపార సముదాయాల ముందు రోడ్లను ఆక్రమించిన బోర్డులు, అడ్డంగా నిలిపిన వాహనాలను తొలగించారు. పాదచారులకు దారి లేకుండా, సబ్ రోడ్డు వినియోగానికి ఆటంకంగా మారిన ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంతో ప్రజలకు ఊరట లభించింది. ప్రజల పక్షాన ఆదాబ్ టుడే కలం గళమెత్తితే.. అధికార యంత్రాంగం కదలాల్సిందేనని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. రహదారులు ప్రజల హక్కు.. ఆక్రమణదారుల సొత్తు కాదనే సందేశం స్పష్టమైంది!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: