*ఆదాబ్ టుడే కథనానికి అధికారుల స్పందన.. ఆక్రమణల తొలగింపు!* *కలం కదిలింది.. అధికార యంత్రాంగం స్పందించింది!*

*అంకుర హాస్పిటల్, గురు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, స్లీపవెల్ ఫర్నిచర్ షాప్ బోర్డ్, ఏ వన్ టీ కంపెనీ బోట్స్ సర్వీస్ రోడ్ ఆక్రమణలను తొలగించిన ఆల్విన్ కాలనీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది.* శేర్లింగంపల్లి , అక్టోబర్ 31 (ఆదాబ్ టుడే): ప్రజా సమస్యలపై ఆదాబ్ టుడే అక్షర పోరాటం మరోసారి ఫలించింది! అక్టోబర్ 30, శుక్రవారం ఆదాబ్ టుడే దినపత్రికలో ప్రచురితమైన రహదారి ఆక్రమణల కథనానికి ఆల్విన్ కాలనీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. వివేకానంద నగర్ కమాన్ నుండి అను ఫర్నిచర్ వరకు సర్వీస్ రోడ్ లో వ్యాపార సముదాయాల ముందు రోడ్లను ఆక్రమించిన బోర్డులు, అడ్డంగా నిలిపిన వాహనాలను...