🚨బ్రేకింగ్ న్యూస్🚨 | ఆదాబ్ టుడే

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లోకి పలువురు నాయకులు! మూసాపేట్‌కు చెందిన బాలాగౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల చేరిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ సమక్షంలో గులాబీ కండువాలు కూకట్‌పల్లి, అక్టోబర్ 25 (ఆదాబ్ టుడే): కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. మూసాపేట్‌కు చెందిన బాలాగౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కృష్ణారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.