🏠 aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 6:04 pm Posted by : AADHAB TODAY

బడి బస్సుకు చిన్నారులే బలం.. ఇదేం దారుణం..?

News Image
### పుస్తకాలు మోయాల్సిన చేతులతో బస్సును నెట్టిస్తున్నారా..?

విద్యార్థుల భద్రతతో చెలగాటమా..? ప్రెసిడెన్సీ విద్యాసంస్థ యాజమాన్యం ఏం చెబుతుంది..?

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలో ప్రెసిడెన్సీ విద్యాసంస్థకు చెందినదిగా పేర్కొంటున్న స్కూల్ బస్సును విద్యార్థులు నెడుతున్న దృశ్యం ఆందోళన కలిగిస్తోంది. చదువుకోవాల్సిన చిన్నారులు రోడ్డుపై భారీ బస్సును నెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? బస్సు ఫిట్‌నెస్ ఏమైంది? విద్యార్థుల భద్రతకు బాధ్యులెవరు? ఘటనపై విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
🏠 Home