🔴 బ్రేకింగ్ న్యూస్ చిరు వ్యాపారుల సమస్యపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందన! ఫ్లైఓవర్ కింద వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కమిషనర్‌కు విజ్ఞప్తి
📍 కూకట్‌పల్లి: ఫతేనగర్ డివిజన్ వాల్మీకి నగర్ సొసైటీ వద్ద ఫ్లైఓవర్ కింద చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా చూడాలని కమిషనర్‌తో మాట్లాడి కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ పారిశుద్ధ్య చర్యలు చేపడతామని, చిరు వ్యాపారులను అనవసరంగా ఇబ్బంది పెట్టబోమని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే చొరవతో తమ సమస్య పరిష్కారానికి స్పందన లభించడంతో చిరు వ్యాపారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈ వరుణ్ దేవ్, జలమండలి మేనేజర్ హిమజ, రాష్ట్ర నాయకులు రాములు, కంచి బిక్షపతి, సుదర్శన్ రెడ్డి, ఆఫ్జాల్, సాయి, వినయ్, రమేష్, లక్ష్మణ్, వేణు, నందు తదితరులు పాల్గొన్నారు.