🏠 aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 12:34 am Posted by : AADHAB TODAY

బీజేపీ నేత రవికుమార్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు

News Image
బీజేపీ నేత రవికుమార్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు

మర్యాదపూర్వకంగా కలిసిన మాధాపూర్ డివిజన్ బీజేపీ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్

ఆదాబ్ టుడే (శేరిలింగంపల్లి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ శ్రీ రవికుమార్ యాదవ్‌ను మాధాపూర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన గంగల రాధాకృష్ణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
🏠 Home