పూల అలంకరణలో మెరిసిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి

దసరా వేళ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆదాబ్ టుడే (హైదరాబాద్): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ రకాల రంగురంగుల పూలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.